పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని.. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబికానగర్ లయోల పాఠశాలలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు.
రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నందున డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటుతున్నామన్నారు. భవిష్యత్తు తరాల వారికి పర్యావరణహిత వాతావరణాన్ని అందించడం కోసం మొక్కల పెంపకం చేపట్టడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎస్పీ అన్నారు.