రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వైష్ణవాలయాల్లో పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించారు.
స్వామివారి కల్యాణ మండపంలో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వార్లకు డోలోత్సవం చేపట్టారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.