ETV Bharat / state

తెలంగాణలో మరో శ్వేత విప్లవం రావాలి: లక్ష్మారెడ్డి

వచ్చే రెండేళ్లలో గాలికుంటు రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో పాడి పరిశ్రమకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 30 వేల మంది యువతకు పాల ఉత్పత్తి ద్వారా ఆదాయం రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

should become a  foot and mouth disease free state in the next two years
చ్చే రెండేళ్లలో గాలికుంటు రహిత రాష్ట్రంగా అవతరించాలి
author img

By

Published : Dec 22, 2020, 5:35 PM IST

రానున్న రెండేళ్లలో గాలికుంటు రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని, విజయ పాల డైరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

రాష్ట్రంలో రెండో తరం శ్వేత విప్లవం రావాల్సి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రాష్ట్రంలోని 25 వేల నుంచి 30 వేల మంది యువతకి పాల ఉత్పత్తి ద్వారా ఆదాయం రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రెండు సంవత్సరాలలో గాలికుంటు రహిత తెలంగాణ రాష్ట్రంగా అవతరించేందుకు రైతులు కృషి చేయాలన్నారు. పాడి పరిశ్రమకు జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన గోడపత్రికల ఆవిష్కరణతో పాటు, విజయ డైరీ అధ్యక్షులు సమకూర్చిన పాల డబ్బాలను గ్రామంలోని పాల ఉత్పత్తిదారులకు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: అవి పాలు కాదు.. ఆరోగ్యాన్ని హరించివేసే కాలకూట విషం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.