రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కాబోయే జాతర కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వచ్చే భక్తులకు సదుపాయాల కల్పన కోసం ఈ సారి జాతర బడ్జెట్‌ను 2కోట్ల 56 లక్షల రూపాయలకు పెంచారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడపనుంది. హైదరాబాద్ నుంచి వేములవాడకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.