Revanth Reddy Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం మాట తప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.10 కోట్లతో చేసిన అభివృద్ధి తప్ప.. ఆ తర్వాత జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. పార్టీ అధికారంలోకి వస్తే.. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
రాజన్న ఆలయ అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేదు: పదే పదే హిందుత్వం గురించి మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. రాజన్న ఆలయ అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎప్పుడు కూడా హిందుత్వం అంశాన్ని రాజకీయంగా వాడుకోవడమే తప్ప.. చేసిందేమీ లేదని ఆరోపించారు. అలాంటి మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.
దొరలకు ఒక నీతి.. గిరిజనులకు మరొక నీతా?: ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పెళ్లి అయిన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి.. గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు మరొక నీతా? అని అన్నారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి.. అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి వివరించారు.
"వేములవాడ రాజన్న ఆలయాన్నిఅభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. మిడ్ మానేరు బాధితుల పరిహారంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు ఒక నీతా? మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాను: నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేవంత్‌రెడ్డి చేస్తోన్నహాథ్ సే హాథ్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రేవంత్ పాదయాత్ర కొనసాగుతుండగా.. ఆయన కాన్వాయ్ కార్లు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చదవండి: రేవంత్‌రెడ్డి పాదయాత్రలో అపశృతి ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీ