ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకదాశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే స్వామివారికి 11మంది రుత్వికులచే మహన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో అఖండ భజనలు చేసి, ఆలయ ప్రాంగణంలోని విఠలేశ్వర స్వామివారికి మహా పూజ నిర్వహించారు. భజన కార్యక్రమంలో చిన్నారులు ఆలపించిన కీర్తనలు అందరిని ఆకట్టుకున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు, పట్టణ ప్రజలు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ధర్మగుండంలో స్నానాలు అచరించి... ఆలయంలోని కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెలను సమర్పించారు.
ఇవీ చూడండి: చివరి దశకు చేరుకున్న యాదాద్రి నిర్మాణం