రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి భిక్షపతి అనే వ్యక్తి నెల క్రితం పచ్చ కామెర్ల వ్యాధితో మృతి చెందాడు. మృతునికి భార్య స్వప్న, కొడుకు హర్షిత్, కూతురు ఉన్నారు. కుటుంబ పోషణ, చిన్నారుల ఆలనపాలన చూసుకుంటూ స్వప్న ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చిన్న పిల్లలను ఆదుకోవడానికి తన వంతు సాయంగా రూ.50 వేలు, క్వింటా బియ్యం, బట్టలను మృతుని కుటుంబానికి అందజేశారు. అభం శుభం తెలియని చిన్నారులు ఇంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. వారికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ బన్సీలాల్, ఎల్లారెడ్డిపేట ఎస్సై వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము'