రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో, చందుర్తి మండలంలోని మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్.అరుణతో కలిసి సందర్శించారు.
ప్రారంభోత్సవానికి రైతు వేదికలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్, ఎస్పీకు తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికతోపాటు పల్లె ప్రకృతి వనాన్ని వారు పరిశీలించారు. మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికకు కలపతో చేసిన ఫినిషింగ్ అందరినీ ఆకర్షిస్తుంది. గ్రామ సర్పంచ్ అంజిబాబు స్వయంగా ముందుకు వచ్చి తన సొంత డబ్బుతో ఈ వేదికను నిర్మించారు.
అనంతరం సిరిసిల్ల పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. వారి వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సంబంధిత మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, తదితరులు ఉన్నారు.
![Rajanna Sircilla collector Krishna Bhaskar and SP Rahul visited rythu vedika in Konaraopeta and Chandurti mandals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-61-31-srcl-collector-sp-raithuvedikalasandarshana-av-g1-ts10040_31012021165503_3101f_1612092303_39.jpg)
ఇదీ చూడండి: 'థామస్రెడ్డిపై కార్మికచట్టం ప్రకారం చర్యలు తప్పవు'