రాజన్నసిరిసిల్ల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెరాస హవా కొనసాగింది. అధికార పార్టీ జోరును ప్రతిపక్షాలు అడ్డుకోలేకపోయాయి. జిల్లాలో మొత్తం 12 జడ్పీ స్థానాలుండగా 11 చోట్ల గులాబీ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్కస్థానంతోనే సరిపెట్టుకుంది. ఎంపీటీసీ స్థానాల్లోనూ సింహభాగం సీట్లను తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 123 ఎంపీటీసీ స్థానాల్లో 72చోట్ల గులాబీ పార్టీ గెలిచింది. 18 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. 8 స్థానాలు భాజపా గెలిచింది. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్ల ఓట్ల లెక్కిపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. తిరుగులేని విజయం సాధించిన తెరాస నేతలు సంబురాలు చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ.. కేరింతలు కొట్టారు.
# | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
జడ్పీటీసీ | 11 | 01 | 0 | 0 | 12 |
ఎంపీటీసీ | 72 | 18 | 08 | 25 | 123 |
మండలాల వారీగా ఫలితాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
బోయినిపల్లి | 7 | 2 | 0 | 2 | 11 |
చందుర్తి | 6 | 3 | 1 | 0 | 10 |
ఇల్లంతకుంట | 8 | 1 | 1 | 4 | 14 |
గంభీరావుపేట | 8 | 2 | 0 | 3 | 13 |
కోనరావుపేట | 7 | 2 | 0 | 3 | 12 |
ముస్తాబాద్ | 8 | 3 | 1 | 1 | 13 |
రుద్రంగి | 5 | 0 | 0 | 0 | 5 |
తంగళ్ళపల్లి | 7 | 0 | 2 | 5 | 14 |
వీరన్నపల్లి | 3 | 0 | 0 | 2 | 5 |
వేములవాడ రూరల్ | 2 | 3 | 1 | 1 | 7 |
వేములవాడ అర్బన్ | 3 | 1 | 1 | 1 | 6 |
ఎల్లారెడ్డిపేట | 8 | 1 | 1 | 3 | 13 |
ఇదీ చదవండి:కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం