రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ జలాశయం సందర్శనకు వెళ్తుండగా... పొన్న ప్రభాకర్, సీనియర్ నాయకుడు ఆది శ్రీనివాస్‌ను అడ్డుకొని మాజీ కౌన్సిలర్ మధు ఇంట్లో బంధించారు.
సూరమ్మ జలాశయం సందర్శన కార్యక్రమం చేపడతామని కాంగ్రెస్ నాయకులు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున వెళ్తుండగా... అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా జలాశయం సందర్శనకు వెళ్తున్నందున... అనుమతి ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
ఇదీ చూడండి: తెలంగాణకు కొత్తగా కేటాయించేది మూడు రైళ్లేనా ?