ETV Bharat / state

ఈ నెల 13న జలదీక్ష విజయవంతం చేయాలి: పొన్నం - కాంగ్రెస్ జలదీక్ష

కేసీఆర్​, కేటీఆర్​ అసమర్థత వల్లే ఎగువ మానేరు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ విమర్శించారు. ఈ నెల 13న నిర్వహించే జలదీక్షకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

pcc working president appeal to karimnagar people success jala deeksha
ఈ నెల 13న జలదీక్ష విజయవంతం చేయాలి: పొన్నం
author img

By

Published : Jun 11, 2020, 5:01 PM IST

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే జలదీక్షకు పోలీసులు అనుమతించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ కోరారు. కేసీఆర్​, కేటీఆర్​ అసమర్థత వల్ల ఎగువ మానేరు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదో ప్యాకేజీలోని రంగనాయక్​ సాగర్​, కొండపోచమ్మ, మల్లన్నసాగర్​ పనులు పూర్తయినప్పటికీ... రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్​ను ప్రశ్నించారు.

ఈ నెల 13న జలదీక్ష విజయవంతం చేయాలి: పొన్నం

కేటీఆర్​కు ఫాంహౌజ్​ లేనప్పుడు స్టే ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. ఇప్పటికైనా ఫాంహౌజ్​తో సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని పొన్నం డిమాండ్​ చేశారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో జరుగుతున్న అన్యాయాల గురించి... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందించడం లేదని విమర్శించారు. ఎగువ మానేరు ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.