రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేశారు.
జిల్లాలో 24 సహకార సంఘాలుండగా... మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 21 సంఘాల్లో 144 డైరెక్టర్ స్థానాలకు 365 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రేపు జరగనున్న సహకార ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి బుద్ధ నాయుడు తెలిపారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
- ఇవీ చూడండి: గోదావరి జలాల్ని 100 శాతం వాడాలి: కేసీఆర్