రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని ఆవేదన చెందారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని వాపోయారు.
కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లుకు తరలించడానికి లారీలు లేకపోవడం వల్లే జాప్యం జరుగుతోందని అన్నదాతలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తమ ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష