రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో పాటు తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు తల్లి మమత, కూతుర్లు సైనీ(4), శాంతి(2)గా గుర్తించారు. ఇద్దరు పిల్లలకు ఉరివేసి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉరివేసుకున్న ఆధారాలు లేకపోవటం వల్ల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: ప్రేమ విఫలమై.. మనసు వికలమై!