కరోనా వ్యాప్తి నివారణకు సిరిసిల్ల పురపాలక సంఘం... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. సీఎస్‌ఆర్‌లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన టెస్లా ఇన్‌ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో ఆటోమెటిక్ శానిటైజర్ రీఫిలింగ్, థర్మో స్క్రీనింగ్ పరికరాలను కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. నిరంతరం కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు, సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శరీర ఉష్ణోగ్రతలను పసిగట్టే యంత్రాన్ని పౌరసేవల విభాగం గది వద్ద అమర్చారు. జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిరంతరంగా అలారం మోగుతుంది.
పట్టణంలో నిత్యం 30-40 వాహనాల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తుంటారు. కార్మికులకు ఆర్‌ఎఫ్‌డీఐ కార్డుల్లో సెన్సార్ ద్వారా సీసా నింపుకునేలా ప్రొగ్రామింగ్ చేసి అమర్చారు. దీంతో కార్మికులకు ఇతరుల సహాయం లేకుండానే శానిటైజర్ నింపుకోవచ్ఛు. కరోనా, ఫ్లూ జ్వరాల విజృంభిస్తున్నందున... నియంత్రణకు సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాలను రూపొందించినట్టు సంస్థ సీఈవో ప్రవీణ్ తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి పరికరాలను ఏర్పాటు చేసి వినియోగించడం సిరిసిల్లలో మొట్టమొదటిసారి అని ఆయన వివరించారు.