రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి ఎంపిక కోసం పర్యటించారు.రైతు వేదికల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. చొప్పదండి నియోజక వర్గంలో రైతులు పంటమార్పిడిలో ముందున్న విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అభినందించారని తెలిపారు.
ఒక రైతు వేదిక..
జిల్లా వ్యాప్తంగా 70 రైతు వేదికలు నిర్మించేందుకు ఒక్కొక్క దానికి రూ. 20 లక్షలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మించటం, అధికారులు, సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి నేరుగా రైతులతో మాట్లాడే సౌలభ్యం సాధ్యపడుతుందని వివరించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించిన పంట మార్పిడికి, నూతన సాంకేతికతకు రైతు వేదికలు నాంది పలకబోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి : మరో పదివారాలు డ్రైడే కార్యక్రమం.. సీజనల్ వ్యాధులపై సమరం