KTR at Sircilla Agricultural College Inauguration: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల నూతన భవనాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశానికే దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లెల కళాశాలలో తయారు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశదిశ చూపుతోందని అన్నారు.
Sircilla Agricultural College Inauguration: కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కళ్లులేని కబోదులు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా.. తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమానికి హెలికాప్టర్లో వస్తున్నప్పుడు.. మిడ్ మానేరులో నీళ్లు నిండి కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని మంత్రి స్పష్టం చేశారు. సభాపతి పోచారం దయ వల్ల వ్యవసాయ కళాశాలతో పాటుగా పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరైందని తెలిపారు.
అగ్రి సాటిలైట్ హబ్ కూడా ఏర్పాటు చేయాలి: 'ఇక్కడ వ్యవసాయ కళాశాల ఉంది. త్వరలోనే యూనివర్సిటీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం. అగ్రి సాటిలైట్ హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయనికి అనుబంధంగా.. సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో ఈ వ్యవసాయ కళాశాల నూతన భవనాలు సిద్ధం చేశాం.' - కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
'కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కళ్ళు లేని కబోదులు మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడుతున్నారా.. తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. ఇప్పుడు హెలికాప్టర్లో వస్తున్నప్పుడు మిడ్ మానేరులో నీళ్లు నిండి కళకళలాడుతుంటే ఎంతో సంతోషించాం. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నాం. దేశానికే దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లెల కళాశాలలో తయారు కావాలి. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశదిశ చూపుతోంది'. -కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఇవీ చదవండి: