ETV Bharat / state

Siricilla Kotha Cheruvu: సిరిసిల్లలో కొత్త చెరువుకు పర్యాటక శోభ

Siricilla Kotha Cheruvu: సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు పర్యాటక శోభ సంతరించుకుంది. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా... సకల సౌకర్యాలతో మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తున్నారు. సుమారు రూ. 11 కోట్లతో 4 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న సుందరీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి.

Siricilla Kotha
Siricilla Kotha
author img

By

Published : May 8, 2022, 5:38 AM IST

సిరిసిల్లలో కొత్త చెరువుకు పర్యాటక శోభ

Siricilla Kotha Cheruvu: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సిరిసిల్లలో ప్రత్యేకంగా కొత్త చెరువును ముస్తాబు చేశారు. చెరువుకు ఇరువైపులా జంతువులు, పక్షులతో కూడిన ఆకర్షణీయమైన ఆకారాలు రూపొందించారు. దాదాపు రెండుకిలోమీటర్ల మేర వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లను తీర్చిదిద్దారు. ట్రాక్ చుట్టూ గ్రీనరీ, లైటింగ్‌ ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రైలు ట్రాక్‌ను పొందుపరిచారు. యోగశాల, క్యాంటీన్, పుట్టినరోజు వేడుకలు చేసుకునే ఓ వేదిక వంటి వసతులు కల్పించారు. జలాశయంలో విహరించేందుకు బోటింగ్‌ ఏర్పాటు చేశారు.

పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా... వినోదం పంచేందుకు దాదాపు మూడున్నర ఎకరాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. పాత్ వేలు, బేబీ కేర్ సెంటర్, సీతాకోక చిలుకల గార్డెన్, చిట్టడివి, వ్యూ పాయింట్ డెక్, ల్యాండ్ స్కేపింగ్ వంటివి ఏర్పాటు చేశారు. కోటి రూపాయలతో జిప్ సైకిల్, జీప్ లైన్, క్రొకోడైల్ స్లయిడ్, కమాండో కోర్స్, డైనోసార్ వంటి పిల్లలను ఆకర్షించేలా ఆటల పరికరాలను అందుబాటులో ఉంచారు.

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న కొత్త చెరువు పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు... జిల్లా కలెక్టర్ అనురాగ్‌జయంతి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు వేగిరం అయ్యేలా చూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.