కేంద్రం నుంచి వ్యవసాయ రంగానికి సంబంధించి గత ఏడున్నరేళ్లలో అణాపైసా సాయం కూడా లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం, రైతులు రికార్డు స్థాయిలో (ktr speaks on paddy procurement) వరి సాగు చేస్తున్నారని ఎఫ్‌సీఐ చెప్పిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రైతుల స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా యాసంగిలో పంటను కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయాన్ని (ktr speaks on grains collection) పునఃసమీక్షించాలని కోరారు. యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు.
జాతి నిర్మాణంలో తెలంగాణ సంపద ఉందని రిజర్వ్ బ్యాంకు సహా ప్రతిష్ఠాత్మక సంస్థలు చెబుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ధనం తీసుకునే కేంద్రం.. ధాన్యం తీసుకోదా అంటూ ప్రశ్నించారు. స్థానిక భాజపా నేతలు చెప్పినట్లు వరి కొనుగోలుకు కేంద్రం సుముఖంగా ఉంటే.. దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌తో (ktr fires on bandi sanjay) రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భాజపా మాటలు నమ్మి రైతులు వరి పండిస్తే నష్టపోతారని.. ముఖ్యమంత్రి చేసే ప్రకటన ప్రకారం నడుచుకోవాలని రైతన్నలను కోరారు. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ప్రభుత్వం (ktr seeks farmers support) తరఫున చేసే మహాధర్నాకు మద్దతివ్వాలని కోరారు.
'యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేయాలి. తెలంగాణ ధనం తీసుకునే కేంద్రం ధాన్యం తీసుకోదా?. యాసంగి పంటను కొనబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. భాజపా మాటలు నమ్మి వరి వేస్తే రైతులు నష్టపోతారు. ప్రభుత్వం తరఫున చేసే మహాధర్నాకు రైతులు మద్దతివ్వండి.'
- కేటీఆర్, రాష్ట్ర మంత్రి
ఇదీచూడండి: CM KCR Letter to PM: ఎంత కొంటారో చెప్పండి.. ప్రధానికి కేసీఆర్ లేఖ