కాళేశ్వరం ప్రాజెక్టు 9,10,11,12 ప్యాకేజీల భూసేకరణ, నిర్మాణ పురోగతిపై రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, ఫీడర్ ఛానల్ల భూసేకరణ లక్ష్యాలను గ్రామాల వారీగా సాధించాలని అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనులు, భూసేకరణ ఏకకాలంలో సాగాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12 మిగిలిన భూసేకరణకు కావాల్సిన నిధుల వివరాలను తెలియజేయాలని మంత్రి అధికారులను కోరారు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని సూచించారు. బటన్ నొక్కగానే జిల్లాలోని చెరువులన్నీ నిండేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.