ETV Bharat / state

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు: మంత్రి కేటీఆర్ - Minister KTR inaugurated the Racharla Boppapur rythu vedika

రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్‌లో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు: మంత్రి కేటీఆర్

author img

By

Published : Mar 23, 2021, 6:02 PM IST

రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో 2,600 రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసి.. రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని మంత్రి కేటీఆర్​ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్​లో మంత్రి కేటీఆర్​ పర్యటించారు. గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవర్ధన్ గౌడ్​ తన సొంత నిధులు 24 లక్షల రూపాయలతో నిర్మించిన ఏసీ రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ.. రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు.

దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకుందని... ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ వారే చెబుతున్నారని వివరించారు. ప్రస్తుత బడ్జెట్​లో రైతుల కోసం 5 వేల 250 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలు అన్నింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి.. నేరుగా అంతర్జాలంలో శాస్త్రవేత్తలతో రైతులకు నాణ్యమైన సలహాలు, సూచనలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు: మంత్రి కేటీఆర్

ఇదీ చూడండి: రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.