KTR విద్యార్థులు ఆలోచనలకు పదునుపెడితే ప్రపంచమే అబ్బురపడేలా ఆవిష్కరణలు చేయవచ్చని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన 'గిఫ్ట్-ఎ-స్మైల్' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సాంసంగ్, ఆకాశ్ బైజూ సంస్థలు సిరిసిల్ల కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేసేందుకు ముందుకొచ్చాయి. 'గిఫ్ట్-ఎ-స్మైల్' కార్యక్రమంలో భాగంగా తొలి రెండు విడతల్లో.... అంబులెన్స్‌లు, త్రిచక్రవాహనాలను అందించగా.... మూడో విడతలో సాంసంగ్, ఆకాశ్ బైజూ సంస్థలు ఈ ల్యాప్‌టాప్‌లను అందించాయి.
కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.... జూనియర్ కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ప్రపంచంతో పోటీపడుతూ.... విద్యార్థులు చదువులు సాగించాలన్న కేటీఆర్.... అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటే, తప్పక విజేతలవుతారని చెప్పారు. ఉన్నత విద్యలో, ఆవిష్కరణల్లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల నుంచి మరింతగా వస్త్రాల ఉత్పత్తి పెరగాలని కేటీఆర్ సూచించారు.
సిరిసిల్ల నేత కార్మికులకు ఎంతో నైపుణ్యం ఉంది. సిరిసిల్ల పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. త్వరలోనే అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తాం. విశ్వాసాలకు అనుగుణంగా పండుగ కానుకలు అందిస్తున్నాం. ఏటా రూ.300 కోట్లు బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నాం. చేనేతలకు 40 శాతం, మర కార్మికులకు 10శాతం నూలు రాయితీ ఇస్తున్నాం. మహిళల అభిరుచులకు అనుగుణంగా కోటి చీరలు సిద్ధం చేశాం. -కేటీఆర్, మంత్రి
-
Keeping his birthday promise, Minister @KTRTRS distributed digital tabs to 11th and 12th standard government college students in Rajanna Sircilla District today.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Minister distributed the tabs in his personal capacity under the '#GiftASmile' initiative. pic.twitter.com/omYmPLILUF
">Keeping his birthday promise, Minister @KTRTRS distributed digital tabs to 11th and 12th standard government college students in Rajanna Sircilla District today.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 22, 2022
Minister distributed the tabs in his personal capacity under the '#GiftASmile' initiative. pic.twitter.com/omYmPLILUFKeeping his birthday promise, Minister @KTRTRS distributed digital tabs to 11th and 12th standard government college students in Rajanna Sircilla District today.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 22, 2022
Minister distributed the tabs in his personal capacity under the '#GiftASmile' initiative. pic.twitter.com/omYmPLILUF
ఇవీ చదవండి: