KTR convoy Stop: మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కొందరు యువకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రి కాన్వాయ్‌లో వెళ్తున్న కార్ల వెంట పరుగులు తీశారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మినీ స్టేడియం, డిగ్రీ కాలేజీ ,30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ముస్తాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
'గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు'
'కాంగ్రెస్ ఆఫీస్‌లోకి పోలీసులు.. కార్యకర్తలపై లాఠీఛార్జ్!'.. నిజమెంత?