ETV Bharat / state

KTR: 'సిరిసిల్ల జిల్లాలో ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందిస్తాం'

సిరిసిల్ల జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్​లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా కృషి చేద్దామని జిల్లా ఎమ్మెల్యేలకు, అధికార యంత్రాంగానికి మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు, సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Minister ktr
సిరిసిల్ల
author img

By

Published : Aug 18, 2021, 6:06 PM IST

హైదరాబాద్ ప్రగతిభవన్​లో రాష్ట్రస్థాయి సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పాటు సిరిసిల్ల జిల్లా (Siricilla District) అధికార యంత్రాంగం, జిల్లా శాసనసభ్యులతో మంత్రి కేటీఆర్ (Minister Ktr) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Minister
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశం

పెరిగిన వ్యవసాయ సాగు...

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో జిల్లాలో భారీ ఎత్తున వ్యవసాయ సాగు పెరిగిందని, అయితే ప్రస్తుతం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ సాగుని సంపూర్ణం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి చెరువుని నింపడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన సూక్ష్మ స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని, ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతాంగం సూచనలను సైతం పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.

క్షేత్రస్థాయిలో...

జిల్లా పరిధిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్​, రసమయి బాలకిషన్, సుంకె రవికుమార్​ల నుంచి క్షేత్రస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చెరువుల అభివృద్ధితో పాటు అదనంగా నూతనంగా చెక్​డ్యామ్​ల నిర్మాణం చేపట్టడం ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు.. కేటీఆర్​కు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో స్థానిక రైతులు, ప్రజలతో తాము సమన్వయం చేసుకుంటామని, ఇందుకు అవసరమైన నిధులను, ప్రణాళికను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రికి విన్నవించారు.

మరోసారి సమావేశం...

ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో అతి త్వరగా పూర్తయ్యే పనులపైన దృష్టిసారించి, వాటిని పూర్తిచేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిలో నీటి వనరులు వాటి కింద ఉన్న ఆయకట్టు ప్రాజెక్టుల వివరాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఈ సమీక్ష సమావేశం ప్రాథమికమైందని త్వరలోనే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సలహాలు సూచనలతో పాటు పనుల పురోగతిపైనా మరోసారి సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.