రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారికి దర్శించుకునేందుకు విచ్చేసిన చాగంటికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్న చాగంటి కోటేశ్వరరావు... ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు... చిత్రపటాలు అందజేసి శాలువతో సత్కరించారు. తన కుమారునికి సంతానం కలగాలని స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపిన చాగంటి... కవల పిల్లలు జన్మించగా కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నట్లు మంత్రి గంగుల చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ