రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాకలోని చెరువులన్నీ కాళేశ్వరం జలాలతో నిండిపోయినందున గ్రామస్థులంతా కట్ట మైసమ్మకు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ వేడుకకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.
రైతులను రాజులుగా చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరమనే బృహత్కర ప్రాజెక్టును నిర్మించారని రసమయి పేర్కొన్నారు. భవిష్యత్లో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతగిరి అన్నపూర్ణ జలాశయం ద్వారా ఇల్లంతకుంట మండలంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వానాకాలం పంటకు సరిపడేలా చెరువులు, కుంటలను నింపుతామని తెలిపారు.
- ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా