KTR Speech at Yuva Atmeeya Sammelanam Sircilla : ఎన్నో పోరాటాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని.. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకొస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. తమను గెలిపించాలని కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇస్తోందన్నారు. మోదీ దేవుడని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ఆ పార్టీ హామీ ఏమైందని ప్రశ్నించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజలు ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి కులం, సంక్షేమమే మతంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కులం పేరిట ఒకరు.. మతం పేరిట మరొకరు రాజకీయాలు చేస్తున్నారని.. విజన్ ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా అని ఆలోచించాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల మాదిరిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
KTR Comments on Congress Party : 'కాళేశ్వరం వల్లే.. 4 జిల్లాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది'
ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదు. మోదీ దేవుడని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భారతీయ జనతా పార్టీ హామీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఎన్నికల వేళ ప్రజలు ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలి. ఇతర పార్టీల్లో విజన్ ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా ఆలోచించాలి. - మంత్రి కేటీఆర్
ఏది కావాలి రైతన్నా..? అంతకుముందు రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను బేరీజు వేస్తూ.. ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు. కేసీఆర్ ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల విద్యుత్ కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిన 3 గంటల విద్యుత్ కావాలా? రైతు బంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా? నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా? అని కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
KTR Meeting with War Room Incharges : "సర్వేలన్ని బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయ్"