సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి భవనానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో హెరిటో ఫౌండేషన్ రూ.5 కోట్లను అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇతరులు కూడా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పేరిట శిబిరాలు నిర్వహించిందని తెలిపారు.
ఇవీ చూడండి: హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా