రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ "గాంధీ సంకల్ప యాత్ర"ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భాజపా నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జాతిపిత మహత్మగాంధీ సంకల్పం నెరవేర్చడానికి భాజపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కోరారు. భాజపా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి పల్లెను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు... ప్లాస్టిక్‌ను నిరోధించి పచ్చదనంతో నింపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రైవేటు బస్సులు'