కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల పాలిట వరంలా మారాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకాలతో ఆడపిల్ల పెళ్లి చేసిన కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువులు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి