సిరిసిల్ల పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో చిత్రకళా కార్మిక సంఘం కళాకారులు కరోనాపై భారీ పెయింటింగ్ వేశారు. కొవిడ్-19పై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు చిత్రీకరించిన ఆ చిత్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. పెయింటింగ్ అర్థవంతంగా ఉందంటూ కళాకారులను అభినందించారు. కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో భాగస్వాములైన ఉద్యోగుల సేవలను ప్రశంసించారు.
లాక్డౌన్ ముగిసేవరకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి జరగకుండా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ కళ, కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వికారాబాద్ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్