ETV Bharat / state

తాత్కాలిక ఏర్పాట్లు.. రాజన్న భక్తులకు ఏటా తప్పని ఇక్కట్లు

Vemulawada Rajanna Temple: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సదుపాయాల కోసం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని ఏటా రూ.ఒకటిన్నర నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా.. చేపట్టే పనులన్నీ తాత్కాలికమే కావడంతో భక్తుల నుంచి అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతర కోసం చేపట్టిన పనులు.. జాతర ముగిసిన వారం రోజుల్లోనే కనిపించకుండా పోతున్నాయనే వాదనలు ఉన్నాయి.

author img

By

Published : Feb 9, 2023, 4:18 PM IST

Etv Bharat
Etv Bharat

Vemulawada Rajanna Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ప్రతియేడు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, అలంకరణలు, తాత్కాలిక నీటి కుళాయిలు, జల్లు స్నానాలను ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంటారు.

అయితే వీటిని శాశ్వతంగా నిర్మిస్తే ప్రతియేడు ఈ ఆర్ధిక భారం తగ్గుతుందని.. ఎందుకు అధికారులు ఆలోచించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. తాత్కాలిక పనుల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నారు కానీ.. శాశ్వత నిర్మాణాలకు ఎందుకు ఉపక్రమించడం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు గుత్తేదారులకు ఆదాయం కల్పిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలయ దర్శనానికి అనేక ఇబ్బందులు ఉన్నాయని.. జాతరలో మరింత అధ్వాన పరిస్థితి ఉంటుందని భక్తులు వాపోతున్నారు.

భక్తులకు సరిపోయే విధంగా సౌకర్యాలు లేవు. ఆలయ అధికారులు, పాలకవర్గం పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదు. సౌకర్యాలను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండే విధంగా నిర్మించాలి. వృద్ధులకు, చిన్నపిల్లలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన క్యూలైన్లను ఏర్పాటు చేయాలి.-భక్తులు

ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల సూచన మేరకు 50 తాత్కాలిక మరుగుదొడ్లు, 30 జల్లుస్నానాల కేంద్రాలు, 25 దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 7 మే ఐ హెల్ప్ యూ కేంద్రాలతో పాటు మూడు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించే ఈ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

భక్తుల రక్షణ కోసం సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్లు, వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈయేడు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.

ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. మరుగుదొడ్లు, అతిథి గృహాలు, జల్లు స్నానకేెంద్రాల సంఖ్యను పెంచాం. గుడి చెరువు సమీపంలో ఉండటానికి అదనపు గదులను కేటాయించాం. భక్తులు అన్ని సౌకర్యాలు తెలుసుకునే విధంగా హెల్ప్​సెంటర్ల సంఖ్యను పెంచాం. -కృష్ణప్రసాద్‌, ఆలయ ఈవో

ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జాతర కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించినా.. ప్రజల ఇబ్బందులను గుర్తించాలని భక్తులు కోరుతున్నారు.

తాత్కాలిక ఏర్పాట్లు.. ఏటా భక్తులకు తప్పని తిప్పలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.