ETV Bharat / state

వేములవాడలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం దాదాపు రెండు గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. చంటిబిడ్డతో దర్శనానికి వచ్చిన ఓ తండ్రి ఆవేదనను పట్టించుకోక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఓ రాజన్న.! ఏందీ ఈ అవస్థ మాకు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

devotees waiting in q lines form two hours ago in vemulawada sri raja rajeswari temple in rajanna sircilla district
క్యూలైన్లలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు
author img

By

Published : Mar 11, 2021, 10:38 AM IST

Updated : Mar 11, 2021, 1:17 PM IST

క్యూలైన్లలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. క్యూలైన్లలో భక్తులను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారుల కుటుంబాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనాలు జరిగేందుకు సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు.

దాదాపు రెండు గంటలకుపైగా భక్తులను క్యూలైన్లలోనే నిలబెట్టిన అధికారులు చోద్యం చూస్తున్నారు. చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతున్న ఓ తండ్రి ప్రాధేయపడిన పోలీసులు వినలేదు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలోనే పోలీసులకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.

సామాన్య భక్తులకు నరకం:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తులను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసులు, అధికారుల కుటుంబాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శనాలు చేయిస్తున్నారు. క్యూలైన్లలో నిల్చున్న సామాన్య భక్తులకు మాత్రం రాజన్న దర్శనం గంటలకొద్దీ క్యూలో నిలుచుంటే తప్ప కావడం లేదు. రెండు గంటలుగా భక్తులని క్యూలైన్లలో నిలబెట్టి అధికారులు మాత్రం వీఐపీ దర్శనంలో మునిగితేలుతున్నారు.

చంటిపిల్లలతో గంటలకొద్ది:

చిన్నపిల్లలను ఎత్తుకొని భక్తులు క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల కొలది పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తులు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఎంపీపీపై సీఐ ఆగ్రహం:

రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన కొనరావుపేట ఎంపీపీ చంద్రయ్యపై చేయి చేసుకుని గల్ల పట్టిన లక్కొచ్చి బయటకు వెళ్లిపోవాలంటూ ఓ సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల పట్ల, మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కోనరావుపేట ఎంపీపీపై చేయి చేసుకున్న సీఐపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే పోలీసులు అడ్డదారుల్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం.

ఇదీ చూడండి: వైభవంగా శివరాత్రి.. శైవాలయాల్లో భక్తుల సందడి

Last Updated : Mar 11, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.