ETV Bharat / state

cotton industry: కాటన్​ పరిశ్రమ వెలవెల.. ఉపాధి కోల్పోయిన కార్మికులు - తెలంగాణ తాజా వార్తలు

అగ్గి పెట్టెలో ఇమిడే చీరలు నేసి అద్భుత కళను సృష్టించిన సిరిసిల్ల కాటన్ పరిశ్రమ(cotton industry) సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో చేనేత నుంచి మరమగ్గాలుగా రాష్ట్రంలోనే అతి పెద్ద వస్త్రోత్పత్తి పరిశ్రమగా విరజిల్లింది. ప్రస్తుతం ఇక్కడి కాటన్ మరమగ్గాలకు రాయితీలు అందడం లేదు. పాలిస్టర్ ఉత్పత్తులకే ప్రభుత్వ ఆర్డర్లు, ప్రోత్సాహకాలు వర్తిస్తున్నాయి. కాటన్ మరమగ్గాలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించకపోతే పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఉత్పత్తిదారులు అంటున్నారు.

Cotton industry in crisis, sircilla district Cotton industry
cotton industry: కాటన్​ పరిశ్రమ వెలవెల.. ఉపాధి కోల్పోయిన కార్మికులు
author img

By

Published : Jun 23, 2021, 2:45 PM IST

సిరిసిల్ల కాటన్ పరిశ్రమ(cotton industry) ఇబ్బందులతో సతమతం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల మరమగ్గాలుంటే.. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోనే 38 వేలున్నాయి. వాటిపై పాలిస్టర్, కాటన్ వేర్వేరుగా వస్త్రోత్పత్తి జరుగుతోంది. పాలిస్టర్ వస్త్రం తేలిగ్గా, అందంగా ఉంటుంది. కాటన్ దుస్తులు సౌకర్యవంతంగా ఉంటూనే సొగసునూ ఇనుమడింపజేస్తాయి. కాటన్ వస్త్రాధారణ ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంక్షోభంలో..

నూలు ధరల పెరుగుదలతో ఉత్పత్తి చేసిన వస్త్రానికి విఫణిలో గిట్టుబాటు ధర లభించకపోవడం లేదు. ప్రభుత్వ ఆర్డర్లలోనూ పాలిస్టర్​కే ప్రాధాన్యత ఇవ్వడంతో కాటన్ వస్త్రోత్పత్తి తగ్గిపోయింది. దాని అనుబంధ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. జిల్లాలో పదిహేనువేలకు పైగా మరమగ్గాలుంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 200లకు పడిపోయిందంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏడాది కాలంగా చిన్నపన్న(అడ్డంలో 36 ఇంచులు వస్త్రం వచ్చే)మరమగ్గాలు తక్కుకింద అమ్ముతున్నారు. పెద్దపన్నవి చీరల ఉత్పత్తులకు అప్​గ్రేడ్ చేసుకున్నారు. నాలుగేళ్లుగా విపణిలో పోటీని తట్టుకుని నిలదొక్కుకునేలా కాటన్ ఉత్పత్తులను తీర్చిదిద్దాలనే ప్రణాళికలేవి కార్యరూపం దాల్చడం లేదు.

వందలాది మంది

జిల్లాలో నిత్యం 1.50 లక్షల మీటర్ల కాటన్ వస్త్రోత్పత్తి జరిగేది. ప్రస్తుతం పదివేల మీటర్లు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. మహిళలు ధరించే పెట్టీకొట్, లంగా, నైటీల తయారీకి ఉపయోగించే వస్త్రానికి జిల్లా పరిశ్రమ ప్రసిద్ధి. ఇక్కడి పరిశ్రమ వర్గాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. చెన్నై, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, గుజరాత్, కేరళ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చేవి. దీనికి అనుబంధంగా వందలాది మంది మహిళలకు దుస్తుల తయారీతో ఉపాధి లభించేది.

మూతపడ్డ మిల్లులు

ఏడాది క్రితం వరకు ఆర్వీఎం పాఠశాల దస్తుల తయారీ ఆర్డర్లు వచ్చేవి... వాటి ఉత్పత్తితోనూ కొద్ది నెలలు ఉపాధి లభించేది. ఈ ఏడాది వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా విజృంభణతో అత్యధికంగా కాటన్ మిల్లులు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
కాటన్ వస్త్రోత్పత్తులకు అనుబంధంగా డైయింగ్(రంగుల అద్దకం), సైజింగ్ యూనిట్లు ఉన్నాయి.

రంగుల పరిశ్రమలు

రంగులు, రసాయాల ధరలు పెరగడం, ఆర్డర్లు లేక ఈ రంగాలు సైతం కుదేలయ్యాయి. జిల్లాలో 120 డైయింగ్, సైజింగ్ యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం 30కి పడిపోయింది. ఒక్కో యూనిట్​లో నిత్యం 10 మంది ఉపాధి పొందుతారు. ఏడాది కాలంగా వీటిలో చాలా యూనిట్లు మూతపడుతూ వస్తున్నాయి. మరమగ్గాలను అప్​గ్రేడ్ చేసేవీలు ఉంటుంది. అద్దకం యూనిట్లలో అలాంటి పరిస్థితి ఉండదు.

2015-16 వరకు వస్త్రోత్పత్తి నిరాటంకంగా సాగింది. తర్వాత నూలు ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి చేసిన వస్త్రం విపణిలో గిట్టుబాటు కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడాది కాలంగా ఆర్డర్లు రావడం లేదు. లక్షల విలువైన మరమగ్గాలను తుక్కు కింద విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కాటన్ పరిశ్రమను ఆదుకునే ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

ఇదీ చూడండి: FAMILY SUICIDE: విషం తాగి ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.