ETV Bharat / state

కల్నల్​ సంతోష్​​బాబు భార్యకు గ్రూప్​-1 ఉద్యోగమివ్వాలి : జీవన్​రెడ్డి - రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్​ సంతోశ్​బాబు నివాళి

గాల్వన్​ లోయలో అమరుడైన కల్నల్​ సంతోష్​​బాబు భార్యకు గ్రూప్​-1 ఉద్యోగమివ్వాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్​, జీవన్​రెడ్డి, స్థానిక నేతలు సంతోశ్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి
author img

By

Published : Jun 18, 2020, 4:38 PM IST

చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్​ సంతోష్​​ బాబుకు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాంగ్రెస్​ నేతలు ఘన నివాళులు అర్పించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​లు పాల్గొన్నారు. కల్నల్​ సంతోష్​​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.

హైదరాబాద్​లో సంతోష్​​బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఆయన సతీమణికి గ్రూప్​-1 ఉద్యోగమివ్వాలని, వారి నివాసానికి 1000 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించాలని కోరారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.