రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ చౌక్‌లో ప్రణబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
వారి కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు