కార్మికుల కృషితోనే ఆదాయంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు వరుసలో నిలిచిందని నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. రైల్వేస్టేషన్లో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ జిల్లా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్మికులు పనితోపాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని కోరారు. అనంతరం రైల్వే గూడ్స్ హమాలీ సంఘ భవనంలో మొక్కలు నాటారు.
ఇవీచూడండి: ఆ ఆలోచన.. ఆదా చేసే.. ఆదాయం మిగిల్చే...