ETV Bharat / state

కేసీఆర్​ మెడలో కండువా.. అందర్నీ ఆకర్షిస్తోంది మెండుగా.. - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ తరచూ సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్​ మాటలు ప్రజలను ఎప్పుడూ ఆకర్షిస్తాయి. అయితే తాజాగా సీఎం వేషధారణ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కేసీఆర్​ వేషధారణ కొత్తగుండటమేంటి ? ఎప్పుడూ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటే కదా వేసేది.. కొత్తగా ఏముంది? అనుకుంటున్నారా..? ఉందండి..! సీఎం వేసుకునే కండువా. రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత వృత్తి వారు దాన్ని తయారు చేశారు. అవి నచ్చిన కేసీఆర్​.. 25 వందల కండువాలను ప్రత్యేకంగా ఆర్డర్​ మీద తెప్పించుకున్నారు.

కేసీఆర్​ మెడలో కండువా.. అందర్నీ ఆకర్షిస్తోంది మెండుగా

author img

By

Published : May 22, 2020, 1:46 PM IST

Updated : May 22, 2020, 5:46 PM IST

కేసీఆర్​ మెడలో కండువా.. అందర్నీ ఆకర్షిస్తోంది మెండుగా..

రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత సెల్లాకు( టవల్స్) రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ముఖానికి మాస్క్ లు కట్టుకునే పరిస్థితి రాగా అందుకు ప్రత్యామ్నాయంగా సిరిసిల్ల సెల్లా(కండువా) హాట్ టాపిక్​గా మారింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సిరిసిల్ల సెల్లను మెడలో వేసుకొని తెలంగాణ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

25 వందల కండువాలకు సీఎం ఆర్డర్​..

సిరిసిల్లలోని అనంత నగర్​కు చెందిన గుంటక మల్లేశం తనయులు కోటేశ్వర్, శ్రావణ్​లు గత 40 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తన వస్త్రధారణలో భాగంగా వేసుకున్న కండువాలు వీరి దగ్గర నుంచి ప్రత్యేకంగా చేయించి తెప్పించుకున్నవే. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి మూడు రంగుల్లో తయారుచేసిన 3000ల టవల్స్​ను వారు అందజేశారు. వీటిని చూసిన ముఖ్యమంత్రి సిరిసిల్ల సెల్లాకు ఆకర్షితులై మరో ఇరవై ఐదు వందల కండువాలకు ఆర్డర్ ఇచ్చినట్లు కోటేశ్వర్ తెలిపారు.

"30 ఏళ్లుగా చేనేత వృత్తిని చేస్తున్నాం. ఈ కరోనా సమయంలో మాస్కు వాడటం ఇబ్బందికరంగా ఉంది.. దీనికి కొంచెం టవల్​ అయితే బాగుంటదని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందుకే నాణ్యతో కూడిన కొన్ని నమూనాలను పాత పద్ధతైన సెల్ల రూపంలో వారికి పంపించాను. అది వారికి ఎంతో నచ్చింది. ఇంకా ఆర్డర్లు ఇస్తున్నారు."

-కోటయ్య, చేనేత వృత్తిదారుడు

మరిన్ని ఉత్పత్తులకు కృషి చేస్తాం:

కరోనా పరిస్థితుల్లో తమ వద్ద రెండు వందల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని వారు తెలిపారు. పాత పవర్​లూమ్స్ పైనే ఇలాంటి కండువాలు సుమారు 50 రకాలుగా చేయవచ్చని వెల్లడించారు. ఒకేసారి నాలుగు కండువాలు నేసే విధంగా అధునాతన యంత్రాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించినట్లయితే మరిన్ని నాణ్యమైన టవల్స్​తో పాటు, కర్చీఫ్​లు, లుంగీలు, దోతులు నాణ్యతతో కూడిన ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. సిరిసిల్ల నుంచి మహారాష్ట్ర, ముంబయి, దిల్లీ, పుణే లాంటి పట్టణాలకు వీటిని సరఫరా చేస్తామని మల్లేశం చెబుతున్నారు.

"కర్ఛీఫ్​, దోతులు, లుంగీలు, ఇంకా చాలా రకాల ఖాదీ వస్త్రాలు తయారు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఉంటే ఇంకా చాల రకాలు తయారు చేసే అవకాశం ఉంటంది. మార్కెట్లో ఇలాంటి ఉత్పత్తులు ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని కోరుతున్నాం."

-శ్రావణ్​, చేనేత వృత్తిదారుడు

గరిష్ఠంగా రూ. 150 వరకు అందుబాటులో..

సిరిసిల్ల మరమగ్గాలపై 100 శాతం కాటన్​తో చేసిన కండువాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. లాక్ డౌన్​తో మూతపడిన వస్త్ర ఉత్పత్తి పరిశ్రమకు కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటుపోట్లను అధిగమిస్తూ విపణిలో డిమాండ్​కు తగ్గట్టుగా నేత కార్మికులు కండువాలను ఉత్పత్తి చేస్తున్నారు. మూడు రకాల సైజుల్లో తయారవుతున్న ఈ కండువాలో నూలు నాణ్యతను బట్టి రూ. 55 నుంచి గరిష్ఠంగా రూ.150 వరకు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

Last Updated : May 22, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.