ETV Bharat / state

CM KCR: 'వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు' - సిరిసిల్లలో సీఎం కేసీఆర్​

"చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే... ఎవరెన్ని మాట్లాడినా... కేసీఆర్​ ప్రయాణాన్ని ఆపలేరు. ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల.. త్వరలోనే పరిపూర్ణం కాబోతోంది. లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా పోతున్నాం. ఎటు చూసినా కాకతీయ, కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతూ.. పచ్చదనంతో పరిఢవిల్లుతూ.. ధాన్యపు రాశులతో విలసిల్లుతోంది. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారందరికి పింఛను ఇవ్వనున్నాం. రైతుల తరహాలోనే చేనేత కార్మికులకు త్వరలోనే బీమా అందించాలనుకుంటున్నాం." అని సిరిసిల్ల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్​ ప్రసంగించారు.

cm-kcr-speech-in-siricilla-tour
cm-kcr-speech-in-siricilla-tour
author img

By

Published : Jul 4, 2021, 4:25 PM IST

Updated : Jul 5, 2021, 9:40 AM IST

ఎవరెన్ని మాట్లాడినా... తన ప్రయాణాన్ని ఆపలేరని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉద్ఘాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్‌ ఏర్పాటవడం చాలా సంతోషమని... జిల్లా వాసులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని దుర్మార్గంగా వాదించేవారని గుర్తుచేశారు. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లక్ష్యం ఏర్పాటు చేసుకుని.. ఆ దిశగా పోతున్నామన్నారు.

ఎటు చూసినా ధాన్యపు రాశులే...

"రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. 92 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్​సీఐకి ఇచ్చినం. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. వలస వెళ్లిన రైతులందరూ వాపస్​ వస్తున్నారు. పాత ఇళ్లను సర్దుకుంటున్నారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేశాం. ఇంకో నాలుగు వేల కోట్లతో త్వరలోనే రెండో విడత ప్రారంభించనున్నాం. తెలంగాణ రాకముందు అధ్వాన్నంగా ఉన్న మత్స్యకారుల పరిస్థితి... ఇప్పుడు మెరుగైంది.

- సీఎం కేసీఆర్​

పొంగుకొస్తున్న భూగర్భ గంగ..

రాష్ట్రంలో గత రెండేళ్లలో 135 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయని సీఎం తెలిపారు. మిషన్‌ కాకతీయలో చేపట్టిన ఏ ఒక్క చెరువు గట్టు తెగలేదన్నారు. చెరువులన్నీ కళకళలాడుతున్నాయని చెప్పారు. పొలాలకు నీళ్లందుతున్నాయని వెల్లడించారు. భూగర్భజలాలు మీటర్లకు మీటర్లే పెరుగుతున్నాయంటే దానికి కారణం మిషన్​ కాకతీయనే అని పేర్కొన్నారు. రూ.15 వేల కోట్లు అయినా కాళేశ్వరం కడతానని అసెంబ్లీలో చెప్పానని.... ఇప్పుడు అది సుసాధ్యం చేసి ప్రశ్నించిన వాళ్లకు సమాధానం చెప్పామని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

సజీవ జలధారగా మారిన కరీంనగర్​..

"రాబోయే కొద్ది రోజుల్లోనే కరీంనగర్​ సజీవ జలధారగా తయారవుతుందని చెప్పినప్పుడు... ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు అది నిజమైంది. ఎగువమానేరు నుంచి మధ్యమానేరు, కరీంనగర్​, మంథని వద్ద గోదారిలో కలిసే సుమారు 175 కిలోమీటర్లు వరకు సజీవ జలధారగా మారింది. ఏప్రిల్‌లో అప్పర్‌ మానేరు నిండుతుందని ఎవరూ అనుకోలేదు. వరద కాలువతో బాల్కొండ నుంచి చొప్పదండి వరకు 110 కిలోమీటర్ల వరకు సాగు నీళ్లందుతున్నాయి. మూడో సజీవ జలధార కాకతీయ కాలువ. ఎనిమిదిన్నర నెలలు కాకతీయ కాలువ పారుతూనే ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్లు గోదావరి సజీవం అయ్యింది."

- సీఎం కేసీఆర్

57 ఏళ్లు నిండిన వారికి పింఛన్​...

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. రైతుబీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా కల్పిస్తామని ప్రకటించారు. చేనేత కార్మికులు, మరమగ్గాల వారు మరణిస్తే రూ.5 లక్షల బీమా త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం పేర్కొన్నారు. గోదావరినే 500 మీటర్లుపైకి తెచ్చాం.. ఎస్సీలను పైకి తేలేమా..? అన్నారు.

సిరిసిల్లకు వరాలు...

రాజన్నసిరిసిల్ల జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. సిరిసిల్లలో కమ్యూనిటీ హాలు కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వచ్చే విడతలో కచ్చితంగా వైద్య కళాశాల వస్తుందని హామీ ఇచ్చారు. నర్సింగ్‌ విద్యార్థుల స్టైఫండ్‌ పెంచుతున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులు ఆపొద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పిన సీఎం... అవసరమైతే మంత్రుల జీతాలు ఆపండని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యులై.. ప్రగతిని పరుగులు పెట్టించాలని సూచించారు.

ఇదీ చూడండి: KCR SIRCILLA TOUR : సర్దాపూర్‌లో మార్కెట్ యార్డు ప్రారంభించిన సీఎం కేసీఆర్

Last Updated : Jul 5, 2021, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.