ETV Bharat / state

CM KCR: 'కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన... వినియోగించుకునే బాధ్యత మీదే' - cm on irrigation

గోదావరి నదీ జలాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సిరిసిల్ల జలకూడలిగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగునీటికి సమస్య అనేది రాకూడదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా సాగునీటి పారుదలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

cm kcr
సీఎం కేసీఆర్
author img

By

Published : Jul 4, 2021, 11:03 PM IST

Updated : Jul 5, 2021, 6:50 AM IST

గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ఎకరం, గోదావరి సాగునీటి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం.. తెలంగాణ జల కూడలిగా సిరిసిల్ల జిల్లా కేంద్రం మారిందన్నారు. సిరిసిల్లతో సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని తెలిపారు. సిరిసిల్ల పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం... అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి పారుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

’గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగుభూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారం చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలు పడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాం. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరముంది. కరవు వచ్చినపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత మరింత అర్థమయ్యేది. అటువంటి కరవు కష్టాలను అధిగమించడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నం. ఇక నుంచి కరవుకు, కాలానికి సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు మన చేతిలో ఉన్నయ్. వాటిని ఎట్లా వాడుకుంటామనేదే తెలివితో ముడిపడి ఉంది‘

- సీఎం కేసీఆర్

నీళ్లను ఎత్తిపోసి నిండుకుండలా జలాశయాలను నిర్మించుకున్న తర్వాత కూడా గోదావరి పరివాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదని సీఎం అన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి జలాలు మూలమూలనా ప్రవహించాలన్నారు. అందుకు చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తి పోసుకోవాలన్నారు. ఎత్తు మీది నుంచి తిరిగి గ్రావిటీ విధానం ద్వారా (మిషన్ భగీరథ పద్ధతిలో) సాగునీటిని పొలాలకు మళ్లించుకోవాలన్నారు.

నీటిని వినియోగించుకునే బాధ్యత మీదే

మిషన్ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్ఠంగా మారిన నేపథ్యంలో వాటిని ముందుగా గోదావరి జలాలతో నింపుకోవాలన్నారు. ఈ రాడార్ పరిధిలో అన్ని చెరువులను నూటికి నూరు శాతం నింపాలని సీఎం తెలిపారు. ’’నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన... వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే‘‘ అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజినీర్లకు సీఎం సూచించారు.

ఎగువ మానేరుకు పూర్వవైభవం తీసుకొస్తాం

జులై 10 తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండలస్థాయి ఇరిగేషన్ అధికారులు కూర్చొని, సాగు నీరును ఏ మూలనా ఎట్లా పారించాలో చర్చలు జరపాలన్నారు. కాంటూర్ లెవల్స్, ఎంఎండీఎల్​తో సహా అన్ని రకాల సాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి ఎకరమూ వదలకుండా తడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు సహా ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నెత్తిమీద నీళ్లు పెట్టుకొని కరీంనగర్ జిల్లా బాధపడటం సరికాదన్నారు. అప్పర్ మానేరు కరీంనగర్ జిల్లా వరదాయిని అని.. ప్రాజెక్ట్​కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఇకనుంచి కరీంనగర్ జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాటు వేసుకునేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులేనన్నారు.

ఎత్తైన ప్రదేశాల్లో నీరందేలా చర్యలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ టెయిల్ ఎండ్ ప్రాంతాల్లోనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రాజెక్టుల పక్కన, రిజర్వాయర్ల వెంట ఉన్న బాల్కొండ, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, మానకొండూర్, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో నీరు లభించకపోవడమేమిటని అధికారులను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎత్తైన ప్రదేశాల్లో కూడా నీరు అందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ప్రతి ఎకరానికి తెలివితో సాగునీటిని సాధించుకోవాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చొని నివేదికను సిద్ధంచేసి తనకు అందించాలని సీఎం తెలిపారు.

మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎం కేసీఆర్​ను అభ్యర్థించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం.. ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిని సందర్శిస్తానని సీఎం తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి:

CM KCR: 'వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు'

CM KCR FIRE: సీఎం కేసీఆర్​కు కోపం తెప్పించిన కత్తెర..!

Last Updated : Jul 5, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.