రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యటించారు. మండేపల్లిలోని రెండు పడక గదుల నిర్మాణాన్ని, కజ్బెకట్కూర్లోని మంకీ ఫుడ్ కోర్టును సందర్శించారు. మంకీ ఫుడ్ కోర్టులో నాటిన జామ, ఉసిరి, బొప్పాయి, అల్లనేరెడు మొక్కలను పరిశీలించారు. కొన్ని మొక్కలు ఫలాలనందించడం చూసి అధికారులను అభినందించారు.
మంకీ ఫుడ్ కోర్డు ద్వారా ప్రజలకు కోతుల బెడద తప్పుతుందని ప్రియాంక తెలిపారు. కజ్బేకట్కూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీలో మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు.