వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను 4 వారాల పాటు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదపరి విచారణను డిసెంబరు 16కు వాయిదా వేసింది.
చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని గతంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు కేంద్ర హోంశాఖకు నివేదించింది. దీనిని పరిశీలించిన హోంశాఖ అధికారులు.. చెన్నమనేని భారతీయుడు కాదని రెండు రోజుల క్రితం కోర్టుకు తెలిపింది. దీనిని సవాల్ చేస్తూ.. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
![Chennamani Ramesh gets bit relief from high court stay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5143788_chennama.jpg)
ఇవీ చూడండి: 'ప్రైవేటు సంస్థల్లో ఆధార్ ధ్రువీకరణ చట్టబద్ధమేనా?'