ETV Bharat / state

సామాజిక భాగస్వామ్యం... వార్షికోత్సవ సంబురం - annual day

సామాజిక భాగస్వామ్యంతో సర్కారు బడులు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. విద్యతోపాటు సహపాఠ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. సృజనాత్మకతకు అద్దం పట్టేలా ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేక వేదికల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సమష్టిగా కృషి చేస్తున్నారు.

సామాజిక భాగస్వామ్యం...వార్షికోత్సవ సంబురం
author img

By

Published : Jul 5, 2019, 10:31 AM IST

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణకు భారీగా ఖర్చుపెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. 2011 సంవత్సరంలో సామాజిక భాగస్వామ్యంతో వార్షికోత్సవ సంబురాలకు బీజం పడగా గడిచిన తొమ్మిదేళ్లలో సుమారు రూ.కోటికి పైగా విరాళాల డబ్బు వెచ్చించడం విశేషం.\

ప్రజాభాగస్వామ్యంతో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడి సృష్టిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమ బోధనను ప్రవేశపెట్టుకుని రూ.లక్షల ఖర్చుతో బడుల బలోపేతానికి కృషి చేస్తున్న ప్రజలు.. విరాళాలు పోగుచేసుకోవడం ద్వారా పాఠశాలల వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించుకొని మరోసారి తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటున్నారు.

పాఠశాలల్లో నూతనోత్తేజం
ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో 44 ప్రభుత్వ ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. ఒక గురుకుల, ఒక ఆదర్శ, రెండు కేజీబీవీ పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సామాజిక భాగస్వామ్యం అలరారుతోంది. వీటిలో 35 పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధన జరుగుతోంది. 2010లో పదిర, దుమాల గ్రామాల్లో ప్రారంభమైన ‘ప్రజాభాగస్వామ్యంతో ఆంగ్లమాధ్యమ బోధన’ అనే నూతన ఒరవడి క్రమంగా అన్ని గ్రామాలకు విస్తరించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పల్లెజనం ఏకతాటిపై నిలవగా విద్యార్థులంతా స్థానిక సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్నారు. 2015-2016 విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున మంజూరు చేసింది.

నైపుణ్యాలు వెలికితీసే వేదికలు
పల్లె సీమల్లోని సరస్వతీ నిలయాలను పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న అన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలను వెలికి తీసేందుకు పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం పాఠశాలల వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రైవేటు బడులను మైమరిపించేలా ఎంతో వ్యయప్రయాసలతో ఆర్థిక వనరులను సమకూర్చుకొని ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలను జరుపుతున్నారు.

మా పాఠశాలలో వార్షికోత్సవం జరుపుకోవడాన్ని గ్రామస్థులమంతా పండుగలా భావిస్తాం. ప్రతి సంవత్సరం వేడుకలను నిర్వహించుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుల, మతాలకు అతీతంగా గ్రామ యువకులు, పెద్దలు, మహిళలంతా కలిసి ఒక సామాజిక సమ్మేళనంగా వార్షికోత్సవ వేడుకల పనులన్నింటినీ కలిసి చేస్తారు.
-పడిగెల రవీందర్‌, సర్పంచి, తిమ్మాపూర్‌

గ్రామ గౌరవాన్ని పెంచేందుకు దోహదపడే వార్షికోత్సవాలను నిర్వహించడంలో ప్రజాప్రతినిధులు క్రియాశీల భూమికను పోషిస్తున్నారు. పిల్లల సమగ్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదికలుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విషయాన్ని గమనిస్తున్న ఆ పాఠశాలల పూర్వ విద్యార్థులు, దాతలు ప్రభుత్వ బడులను పటిష్టపరచడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

ఇవీ చూడండి: నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.