ప్రాజెక్టులతో నీళ్లు వచ్చినవి అని సీఎం కేసీఆర్ తీపిమాటలు చెబుతున్నారు కానీ.. నిర్వాసితుల కన్నీళ్లు కనిపించడం లేదా అని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. చింతమడకలో ఒక్కొ కుటుంబానికి 10లక్షలు ఇచ్చిన సీఎం.. భూములు మునిగిన నిర్వాసితులకు మాత్రం 5లక్షలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: ఒక్క ఎకరానికైనా కాళేశ్వరం నీరిచ్చారా..?: భట్టి విక్రమార్క