ETV Bharat / state

Vemulawada Rajanna temple : మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం - telangana news

Vemulawada Rajanna temple : దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి జాతర శోభను సంతరించుకుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి వేడుకలకు ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. సమ్మక్క సారలమ్మ జాతర ముందు నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుండగా దాదాపు 2 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనాతో అన్ని ఏర్పాట్లు చేశారు.

Vemulawada Rajanna temple , shivratri  jatara 2022
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం
author img

By

Published : Feb 28, 2022, 1:17 PM IST

Updated : Feb 28, 2022, 7:13 PM IST

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం

Vemulawada Rajanna temple : ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధానం... మహా జాతరకు ముస్తాబైంది. వేములవాడ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి సందడి కనిపిస్తోంది. శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు.... గుడికి వెళ్లే దారులన్నింటిని... విద్యుత్‌ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. దారి వెంట ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సిరిసిల్ల వైపు నుంచి వేములవాడకు వచ్చే మార్గంతో పాటు కరీంనగర్‌ మార్గంలో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. గుడి చెరువులో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమ నిర్వహణకు వేదిక సిద్ధం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు.

Vemulawada Rajanna temple , shivratri  jatara 2022
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం

ఆలయ పరిసరాల్లో ప్రత్యేక నిఘా

కరోనా కారణంగా ధర్మగుండం మూసివేయగా... ప్రత్యేకంగా జల్లు స్నానాల నల్లాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు వాటర్‌ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. ఆలయ పరిసరాలతో పాటు... నాంపల్లి గుట్టపై వేములవాడలోని వివిధ కూడళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు.

రేపు ప్రత్యేక పూజలు

వేములవాడలో అర్ధరాత్రి నుంచి ఉదయం 3గంటల వరకు సర్వ దర్శనం... రేపు ఉదయం 4 గంటలకు సుప్రభాతసేవ నిర్వహించనున్నారు. 7 గంటలకు తితిదే తరఫున, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన ఉంటుంది. రాత్రి పదకొండున్నర నుంచి లింగోధ్బవ సమయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుందని ప్రధాన అర్చకులు తెలిపారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రత్యేక బస్సులు

జాతరకు వచ్చే భక్తులను బస్టాండ్‌ నుంచి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఆలయం వద్దకు చేర్చనున్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు 14 మినీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులపై శివుడు, శివలింగం, వేములవాడ దేవస్థానం ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. భక్తులకు చూడగానే తెలిసే విధంగా ఉచిత సర్వీసులు అని రాశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ తెలిపింది. జాతరను పురస్కరించుకుని... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి వేములవాడకు బస్సులు నడుస్తున్నాయి.

shivratri jatara
శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయం

ముస్తాబైన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయం

ఖమ్మం జిల్లా మధిర వైరాలో నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. ప్రసిద్ధ కాశీ పుణ్యక్షేత్రంలోని ఆలయాన్ని పోలిన విధంగా ఇక్కడి ఆలయం కూడా పడమర వైపున ఉంది. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయంలో కొలువుదీరిన శ్రీ మృత్యుంజయ స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలివస్తారు. ఐదు రోజులపాటు ఇక్కడ మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసింది.

ఇదీ చదవండి: Yadadri Moolamantra Yagam : యాదాద్రిలో మహాయాగానికి బదులు మూలమంత్ర యాగం

Last Updated : Feb 28, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.