ABVP leaders blocked KTR convoy: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసును హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ కాన్వాయ్ ముందు బైఠాయించే ప్రయత్నం చేశారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శిలను తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని వారు కోరారు. ఇప్పటి వరకు జరిగిన వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేసి మళ్లీ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. లీకేజీ వెనుక ఉన్న పెద్దవాళ్ల వాళ్ల వివరాలను బయటపెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ఏబీవీపీ నాయకులు వచ్చి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో కాసేపు ఆ పాంత్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకొంది. కాన్వాయ్‌ను అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
KTR comments on TSPSC paper leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. లీకేజీకి తాను బాధ్యత వహించాలని, తన పీఏ తిరుపతి ఉన్నాడని.. పేపర్ అమ్ముకున్నాడని ఆధారాల్లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. మల్యాల మండలంలో 415 మంది పరీక్ష రాస్తే 35 మంది మాత్రమే గ్రూప్-1 నుంచి అర్హత సాధించారని తెలిపారు. తిరుపతి స్వగ్రామంలో ముగ్గురు పరీక్ష రాస్తే ఒక్కరు కూడా అర్హత సాధించలేదని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అబద్దాలు ప్రచారం చేస్తున్న విపక్ష నేతలు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.
CIT investigation of TSPSC paper leakage case: మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లను రెండోసారి రెండోరోజు సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ గ్రూప్1 ప్రాథమిక పరీక్షలో 100కి పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను నిన్న సిట్ కారాలయంలో విచారించారు. ఇవాళ మరికొందరి నుంచి సమాచారం సేకరించే పనిలో సిట్ బృందం ఉంది. ఈ కేసులో ఏ3 నిందితురాలుగా ఉన్న రేణుక సొంత మండలానికి చెందిన తిరుపతయ్యను అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరికొందరు అనుమానితులను సైతం సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి:
TSPSC పేపర్ లీకేజీ కేసు.. రెండో రోజు కొనసాగుతోన్న సిట్ విచారణ
వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదు: కేటీఆర్
గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చాయా.. అయితే సిట్ విచారణ తప్పదు..!