ETV Bharat / state

'హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ బతికించాలి' - haritha haaram program in siricilla

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్ అధికారులతో కలిసి​ మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని... నాటిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ పేర్కొన్నారు.

6th phase haritha haaram program in rajanna siricilla
'హరితహారంలో నాటిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు'
author img

By

Published : Jun 25, 2020, 10:23 PM IST

హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కోనరావుపేటలోని ఊరగుట్టపై జడ్పీ ఛైర్ పర్సన్ అరుణ, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్యతో కలిసి మొక్కలు నాటారు.

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 61 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్​ తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణానికి, జీవ వైవిధ్యానికి, వాతావ‌ర‌ణ స‌మతౌల్యానికి హ‌రితహారం దోహ‌ద‌ప‌డుతుందని... ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.