ETV Bharat / state

'పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకనే మాపై ప్రభుత్వం దాడులు' - Sharmila respond on blocking the padayatra news

YS Sharmila Fires On State Government: రాష్ట్రంలో పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకనే తమపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని వైఎస్​ షర్మిల ఆక్షేపించారు. నిన్న పాదయాత్రలో భాగంగా కటికనపల్లిలో ఏర్పాటు చేసుకున్న నైట్ క్యాంపు టెంట్లను అధికారులు తొలగించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు తెరాస నేతలకు లోబడే పని చేస్తున్నారని వైఎస్​ షర్మిల విమర్శించారు.

Sharmila Fires On TRS
Sharmila Fires On TRS
author img

By

Published : Nov 14, 2022, 4:42 PM IST

YS Sharmila Fires On State Government: రాష్ట్రంలో తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆరోపించారు. అందులో భాగంగానే నిన్న పాదయాత్రకు చెందిన ఫ్లెక్సీలు చించివేశారని విమర్శించారు. ఆ క్రమంలోనే తమ పార్టీకి చెందిన నాయకులపై దాడి చేశారని తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులు కనీసం స్పందించలేదని మండిపడ్డారు. ఇంత జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కటికనపల్లిలో పాదయాత్రలో భాగంగానే నైట్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నామని వైఎస్​ షర్మిల తెలిపారు కానీ అక్కడ నైట్ క్యాంపుకు సంబంధించిన టెంట్లను అధికారులు తొలగించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా పోలీసులు తెరాస నాయకులకు లోబడే పని చేస్తున్నారని వైఎస్​ షర్మిల ఆరోపించారు.

"ప్రజలలో మాకు ఆదరణ లేదని మీరు అనుకున్నప్పుడు మాపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మాకు వస్తున్న ఆదరణను మీరు తట్టుకోలేకనే ఈ దాడులు. మాది పార్టీ కాదని మీరు తీసివేశారు. దాడులు ఎందుకు చేస్తున్నారు. ఎక్కడికి పోయినా మేము స్థానికంగా జరుగుతున్న అవినీతి గురించి, ఎమ్మెల్యే గురించి మాట్లాడాం. వారు దానికి సమాధానం చెప్పకపోగా అందరూ కలిసి నాపై స్పీకర్​కు ఫిర్యాదు చేశారు." - వైఎస్​ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

అసలేెం జరిగిదంటే: నిన్న పాదయాత్రలో భాగంగా వైఎస్​ షర్మిల పెద్దపల్లి జిల్లా చామనపల్లి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే.. తెరాస శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు. షర్మిల గోబ్యాక్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. షర్మిల గోబ్యాక్ అంటూ రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు తెరాస శ్రేణులను అడ్డుకొని వారిని చెదరగొట్టారు. మరోవైపు కటికనపల్లిలో నైట్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. తెరాస శ్రేణులు దానిని సైతం అడ్డుకొని తొలగించాలని డిమాండ్ చేశారు. దీనితో అధికార సిబ్బంది నైట్ క్యాంపునకు సంబంధించిన టెంట్లను తొలగించారు. అయినప్పటికీ షర్మిల కటికనపల్లిలోనే రాత్రి బస చేశారు.

పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకనే తమపై ప్రభుత్వం దాడులు: వైఎస్​ షర్మిల

ఇవీ చదవండి: షర్మిల పాదయాత్రను అడ్డుకున్న తెరాస శ్రేణులు.. గోబ్యాక్​ అంటూ నినాదాలు

​ కనులవిందుగా హిమాచల్​ప్రదేశ్​ ఎటుచూసినా శ్వేతవర్ణమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.