ETV Bharat / state

'కేసీఆర్ పెట్ ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే గోదావరి వరదలు'

sharmila fire on kcr: మంథనిలో గోదావరి వరదల్లో మునిగిపోయన పంట పొలాలను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. కేసీఆర్ పెట్ ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు.

షర్మిల
షర్మిల
author img

By

Published : Jul 22, 2022, 4:42 PM IST

Updated : Jul 22, 2022, 8:05 PM IST

sharmila fire on kcr: పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరదల్లో మునిగిపోయిన పంట పొలాలను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. కేసీఆర్ పెట్ ​ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే ఈ ముప్పంతా అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరాకు నీరు ఇచ్చింది లేదన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల ఇంత నష్టం వాటిల్లిందని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో 18 ఏళ్ల క్రితం కట్టిన దేవాదుల నేటికి చెక్కు చెదరకుండ ఉందని పేర్కొన్నారు.

వరదల వల్ల మంథని ప్రాంతంలో 10వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంట ఎప్పుడు వేసుకోవాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో ఉన్నారని చెప్పారు. తన తప్పులు పక్కదారి పట్టించే పనిలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ వరదలు రాలేదు.. ఇదంతా క్లౌడ్​బరస్ట్ వల్లే అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్ట్​లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా అని ముందుగా అంచనా వేయాలి. కేసీఅర్​కు పరిపాలన చేత కాదు, ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉన్న లేనట్లే అని షర్మిల ఎద్దేవా చేశారు.

"పొలాల్లో ఉన్న పరికరాలు, మోటార్లు పాడైపోయాయి. ఎవరేం కాని హెచ్చరించి లేదు. వరదల వల్ల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఇన్ని ఎకరాల్లోకి నీరు వచ్చింది. మరి దీనికి బాధ్యత ఎవ్వరూ వహించాలి. కేవలం కేసీఆర్ పెట్​ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే ఈ ముప్పంతా. అంతకు ముందు వీరికి నీరు రాలేదు కదా. ఇది కేసీఆర్ తప్పిదం కదా. ఇప్పటికి ఏ అధికారి వచ్చి కూడా వీరికి జరిగిన నష్టం గురించి ఆరా తీయలేదు." -వైతెపా అధ్యక్షురాలు షర్మిల

కేసీఆర్ పెట్ ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే గోదావరి వరదలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అబద్ధాల ప్రాజెక్ట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరదలతో నీట మునిగిన పంట పొలాలను వైఎస్ షర్మిల పరిశీలించారు. బాధిత రైతులును ఓదార్చారు. వాహన శ్రేణి ద్వారా లక్ష్మి పంప్ హౌజ్ సందర్శనకు వెళ్లగా అనుమతి లేదని పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో ఆమె మహాదేవపూర్-కాళేశ్వరం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు షర్మిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ హయాంలో 18 ఏళ్ల క్రితం కట్టిన దేవాదుల నేటికి చెక్కు చెదరకుండ ఉందని పేర్కొన్నారు. మరీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క వరదకే ఎందుకు తట్టుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అబద్ధాల ప్రాజెక్ట్ అని ఆరోపించారు.

ఇవీ చదవండి: 'ఆవిష్కరణ'ల ఖజానా తెలంగాణ.. ఇన్నోవేషన్‌ సూచీలో దేశంలో రెండో ర్యాంకు..

ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం

Last Updated : Jul 22, 2022, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.