కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో గడిచిన ఐదేళ్లలో ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని తెజస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అధికారం చేజిక్కించుకునేందుకు భాజపా, తెరాస డబ్బులు వెదజల్లుతున్నాయని ఆరోపించారు. పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో తప్ప.. మిగతా చోట్ల కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీగా హస్తం పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:భద్రాచలం కూడా మాదే: ఏపీ సీఎం చంద్రబాబు